News August 28, 2024
వైసీపీ నేత న్యూడ్ ఫొటోలు పంపి వేధించాడన్న నటి: టీడీపీ

AP: బాలీవుడ్ నటి జత్వానీ తాను ఎలా <<13950822>>వేధింపులకు<<>> గురయ్యానో ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ Xలో పోస్ట్ చేసింది. ‘వైసీపీ నేత, జగన్ ప్రియ శిష్యుడు కుక్కల విద్యాసాగర్ తనకు న్యూడ్ ఫొటోలు పంపించి వేధించాడని బాలీవుడ్ నటి చెప్పింది. తనను వైసీపీ గ్యాంగ్ ఎలా వేధించిందో తెలిపింది’ అని ట్వీట్ చేసింది.
Similar News
News February 7, 2026
సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CLRI) 13 పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. Jr. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.53,628, Jr.సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.39,545, MTSకు రూ.35,973 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://clri.org
News February 7, 2026
చెరకు తోటలు నరికిన తర్వాత ఇలా చేస్తే లాభం

చెరకును నరికిన తర్వాత కార్శి చేయడం వల్ల విత్తనపు ఖర్చుతో పాటు పొలం తయారీ ఖర్చు తగ్గుతుంది. చెరకు మోడు చెక్కిన 10-20 రోజుల లోపల భూమిలో తగినంత పదును ఉన్నప్పుడు రెండు సాళ్ల మధ్య దుక్కి చేసి భూమి గుల్లబారేట్లు చేయాలి. దీని వల్ల మొక్క తోట వేర్లు నశించి పిలకల నుంచి కొత్త వేర్లు అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా కార్శి తోటల వేర్లకు ప్రాణ వాయువు, తడులు పెట్టినప్పుడు నీరు, పోషకాలు సమానంగా అందుతాయి.
News February 7, 2026
BOBలో 421 పోస్టులకు నోటిఫికేషన్లు

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 421 పోస్టుల భర్తీకి 3 వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో రెగ్యులర్, కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలున్నాయి. జాబును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఈ నెల 26 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్టు, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/


