News October 4, 2025
అసలే ట్రంప్.. ఆపై చేతిలో కొత్త ఆయుధం!

‘నోబెల్’ కోసం ట్రంప్ కరవని గడ్డి లేదు. IND-PAKతో పాటు 7యుద్ధాలు ఆపానని ప్రకటించుకున్న ‘ట్రంపరి’ చేష్టలు చూశాం. తాజాగా <<17908342>>ఇజ్రాయెల్-హమాస్<<>> యుద్ధం ముగిసేలా ఓ ముందడుగు పడింది. దీంతో ‘అసలే ట్రంప్.. ఆపై చేతిలో హమాస్-ఇజ్రాయెల్ ఆయుధం’ ఇక ఆయన్ను ఆపగలమా! అని SMలో చర్చ జరుగుతోంది. నోబెల్ కోసం దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తెచ్చి, ఆపై వాటిని ఆపినట్లు ప్రకటించుకోవడానికైనా వెనుకాడరనే మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.
Similar News
News October 4, 2025
రోహిత్ శర్మతో సెలక్టర్ల కీలక సమావేశం!

భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో ఇవాళ BCCI సెలక్టర్లు మాట్లాడే అవకాశం ఉందని క్రీడావర్గాలు చెబుతున్నాయి. OCT 19 నుంచి వన్డే జట్టు AUSలో పర్యటించనుంది. భవిష్యత్ జట్టు అవసరాలు, కెప్టెన్సీ విషయంపై రోహిత్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆయన అభిప్రాయం తర్వాత జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. కొత్త తరానికి అవకాశం ఇచ్చే క్రమంలో హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
News October 4, 2025
పిల్లలకు ఇలాంటి కథలు చెప్పండి: వైద్యులు

పిల్లలకు కథలు చెప్పడం వల్ల వారిలో మానసికస్థితి మెరుగవుతుందని వైద్యులు చెబుతున్నారు. ‘భయపెట్టే నెగటివ్ కథలు కాకుండా దయ, సత్యం, నిజాయితీతో నిండిన పాజిటివ్ స్టోరీలు చెప్పాలి. రెండేళ్ల లోపువారికి పాటల రూపంలో, ఐదేళ్లలోపు ఊహను ప్రేరేపించేవి నచ్చుతాయి. పంచతంత్రం, ఈసప్ కథలు, అక్బర్-బీర్బల్, తెనాలి రామకృష్ణ కథలు, పురాణాల్లోని మంచి కథలు ఎంతో ఉపకరిస్తాయి. పడుకునే ముందు కథ చెప్పడం ఉత్తమం’అని సూచిస్తున్నారు.
News October 4, 2025
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మొక్కజొన్న సాగు

AP, తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే సమయానికి 2 రాష్ట్రాల్లో 83.15 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగులో ఉండగా.. ఈ ఏడాది 91.89 లక్షల హెక్టార్లకు పెరిగింది. గత ఐదేళ్ల సగటుతో పోలిస్తే 16.3% పెరిగినట్లు కేంద్ర గణాంకాలు పేర్కొన్నాయి. దేశంలో మొక్కజొన్న ఉత్పత్తిలో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా.. తెలంగాణ-5, ఏపీ-7వ స్థానాల్లో ఉన్నాయి.