News November 15, 2024
NCP, BJP మీటింగ్లో అదానీ: అసలు నిజం చెప్పిన శరద్ పవార్

2019లో న్యూఢిల్లీలోని గౌతమ్ అదానీ ఇంట్లో NCP, BJP పొలిటికల్ <<14596038>>మీటింగ్<<>> జరగడం నిజమేనని శరద్ పవార్ అంగీకరించారు. ఈ చర్చల్లో అదానీ మాత్రం పాల్గొనలేదని వెల్లడించారు. ఆఖర్లో డిన్నర్కు ఆతిథ్యమిచ్చారని తెలిపారు. ఎన్నికలయ్యాక మహారాష్ట్రలో NCP, BJP ప్రభుత్వం 80 గంటల్లో కూలిపోవడానికి ముందు ఈ మీటింగ్ జరిగింది. అందులో Sr పవార్, ప్రఫుల్, షా, ఫడ్నవీస్, తాను పాల్గొన్నట్టు అజిత్ పవార్ చెప్పడం సంచలనమైంది.
Similar News
News November 27, 2025
రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<


