News November 21, 2024

‘అదానీ లంచమిచ్చారు’.. USలో కేసు నమోదు

image

భారత పారిశ్రామికవేత్త గౌతం అదానీ చిక్కుల్లో పడ్డారు. లంచం, ఫ్రాడ్ ఆరోపణలతో న్యూయార్క్‌లో ఆయనతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం భారత అధికారులకు సుమారు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి. US ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా పెట్టుబడులు స్వీకరించారనే ఆరోపణలతో కోర్టు వారెంట్ జారీ చేసింది.

Similar News

News November 21, 2024

డాలర్ బాండ్ల జారీ విరమించుకున్న అదానీ

image

రూ.5000 కోట్ల విలువైన డాలర్ బాండ్ల జారీని నిలిపివేస్తున్నామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు NSEకి లేఖ రాసింది. న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో అభియోగాలు నమోదవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. రెన్యూవబుల్ ఎనర్జీ బిజినెస్‌ను విస్తరించేందుకు విదేశాల్లో నిధులు సమీకరించాలని అదానీ గ్రూప్ భావించింది. ఇందుకోసం డాలర్ డినామినేషన్లో బాండ్ల జారీకి సిద్ధమైంది. ఈ కేసుతో ఆ దారి మూసుకుపోయింది.

News November 21, 2024

గంజాయి పండించినా, తరలించినా పీడీ యాక్ట్: హోంమంత్రి

image

AP: గంజాయి సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయిపై సభ్యుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ‘5 నెలల్లో 25వేల KGల గంజాయి పట్టుకున్నాం. ఐదేళ్లలో జగన్ గంజాయిపై సమీక్ష చేయలేదు. గతంలో బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోయాయి. యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌తో నేరస్థులను అణచివేస్తాం’ అని ఆమె స్పష్టం చేశారు.

News November 21, 2024

‘పుష్ప-2’ ట్రైలర్‌పై శిల్పా రవి ప్రశంసలు.. బన్నీ రిప్లై

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ట్రైలర్‌పై సినీ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్‌లో జరిగిన ట్రైలర్ ఈవెంట్ సైతం సినీ ఇండస్ట్రీని షేక్ చేసిందని కొనియాడుతున్నారు. తాజాగా హీరోను, మేకర్స్‌ను అభినందిస్తూ బన్నీ స్నేహితుడు, వైసీపీ నేత శిల్పా రవి ట్వీట్ చేశారు. దీనికి బన్నీ స్పందిస్తూ.. ‘నీ ప్రేమకు ధన్యవాదాలు బ్రదర్’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ వైరలవుతోంది.