News December 6, 2024
అదానీ రాగం: కాంగ్రెస్, BJP ‘ఏక్ హై’ తాళం

పార్లమెంటులో దేశగతిని మార్చే కీలక బిల్లులపై ఎక్కువగా చర్చించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. BJP, కాంగ్రెస్ ‘ఏక్ హై’ ఆరోపణలతో సమయం గడిపేస్తున్నాయని వాపోతున్నారు. సమావేశాలు మొదలయ్యే ప్రతిసారీ కాంగ్రెస్ ‘అదానీ’ రాగం అందుకుంటోంది. తాజాగా US అభియోగాల అంశంతో ‘మోదీ, అదానీ ఏక్ హై’ అంటూ రచ్చకెక్కింది. దీనికి ‘రాహుల్, సొరోస్ ఏక్హై’ అంటూ BJP ఎదురుదాడికి దిగింది. మరి పార్లమెంటులో చర్చలపై మీ కామెంట్?
Similar News
News November 27, 2025
BREAKING: సత్యసాయి జిల్లాలో బాలుడి హత్య

తలుపుల మండల పరిధిలోని గరికపల్లిలో నాలుగేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొమ్మెర హర్షవర్ధన్ అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు బుధవారం సాయంత్రం PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నంబులపూలకుంట(M) గౌకన పేట అడవీ ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 27, 2025
రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.


