News November 27, 2024
అదానీ షేర్లు అదుర్స్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్స్

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేడు దుమ్మురేపుతున్నాయి. US కోర్టు మోపిన అవినీతి, లంచం అభియోగాల్లో తమ ప్రతినిధుల పేర్లు లేవని చెప్పడం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపింది. అదానీ టోటల్ గ్యాస్ 19.9, అదానీ పవర్ 17.1, అదానీ ఎనర్జీ 10, అదానీ ఎంటర్ప్రైజెస్ 9.9, అదానీ గ్రీన్ ఎనర్జీ 9.8, అదానీ విల్మార్ 9, NDTV 7.6, అదానీ పోర్ట్స్ 7.2, అంబుజా 4.7, ఏసీసీ 4, సంఘి 3.7% మేర ఎగిశాయి. ఇక అదానీ నెట్వర్త్ $70.8bగా ఉంది.
Similar News
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్లో ప్రసంగించనున్న ప్రముఖులు

TG: ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్-2047 తొలి రోజు పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడనున్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం ప్రారంభమయ్యే సమ్మిట్ 9న రాత్రి ముగియనుంది.
News December 6, 2025
రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు YELLOW ALERT

TG: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News December 6, 2025
భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచులో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన సఫారీలు 270 రన్స్ చేయగా IND మరో 10.1 ఓవర్లు ఉండగానే టార్గెట్ ఛేదించింది. రోహిత్(75), జైస్వాల్(116*) తొలి వికెట్కు 155 పరుగులు జోడించారు. హిట్ మ్యాన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ(65*)తో కలిసి జైస్వాల్ INDకు విజయాన్ని అందించారు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.


