News November 22, 2024

అదానీ షేర్లు: నష్టాల్లోంచి క్షణాల్లో లాభాల్లోకి..

image

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేడు కళకళలాడుతున్నాయి. నిన్నటి నష్టాల నుంచి రికవరీ బాట పట్టాయి. నేటి ఉదయం మోస్తరు నష్టాల్లో మొదలైన షేర్లు మొత్తంగా 6%మేర లాభపడ్డాయి. అదానీ ఎనర్జీ (-4%) మినహా మిగిలిన 10 కంపెనీల షేర్లూ ఎగిశాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5%, సంఘి ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్ 4%, పవర్, గ్రీన్ ఎనర్జీ, NDTV, విల్మార్ 0.5 నుంచి 2% మేర పెరిగాయి.

Similar News

News November 22, 2024

రేపు మహారాష్ట్ర ఫలితాలు: కాంగ్రెస్ అలర్ట్

image

మహారాష్ట్రలో రేపు ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్యూహ‌ర‌చ‌న‌కు కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. దీని కోసం ప్ర‌త్యేకంగా ముగ్గురు ప‌రిశీల‌కుల్ని నియ‌మించింది. మాజీ ముఖ్య‌మంత్రులు అశోక్ గ‌హ్లోత్‌, భూపేశ్ బ‌ఘేల్‌, క‌ర్ణాట‌క మంత్రి ప‌రమేశ్వ‌ర్‌ల‌ను ముంబై పంపింది. హంగ్ వ‌స్తే ఏం చేయాలి? ఎంవీఏ గెలిస్తే ఎలా ముందుకెళ్లాలనే బాధ్య‌త‌ల‌ను వీరికి అప్ప‌గించింది.

News November 22, 2024

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

image

AP: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ‘గతంలో ఈ పథకం నిధులను తల్లి-విద్యార్థి ఖాతాలో జమ చేస్తామని మోసం చేశారు. YCP ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. మెస్, ట్యూషన్ ఛార్జీలు కూడా చెల్లించలేదు. ఇకపై విద్యార్థుల ఫీజుల బకాయిలు కాలేజీ యాజమాన్యాలకే నేరుగా చెల్లిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News November 22, 2024

ఐదేళ్ల క్రితమే CBN కుట్ర చేశారని YCP బాంబ్

image

AP: కరెంట్ ఛార్జీలతో పాతికేళ్లు రాష్ట్ర ప్రజల నడ్డి విరిచేందుకు ఐదేళ్ల క్రితమే చంద్రబాబు కుట్ర చేశారని ట్రూత్ బాంబ్ పేరుతో YCP ‘X’లో పోస్ట్ చేసింది. 2019లో కమీషన్ల కోసం యూనిట్‌కు రూ.5.90 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. కానీ, 2021లో సెకీతో YCP యూనిట్‌కి రూ.2.49తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. ‘ఇప్పుడు చెప్పు చంద్రబాబు, అసలైన అవినీతిపరుడు నువ్వు కాదా?’ అని ప్రశ్నించింది.