News January 14, 2025

పండగ వేళ 19% పెరిగిన అదానీ షేర్లు.. ఎందుకంటే!

image

అదానీ షేర్లలో నేడు సంక్రాంతి కళ కనిపిస్తోంది. గ్రూప్ షేర్లు నేడు గరిష్ఠంగా 19% వరకు ఎగిశాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే లంచం కేసులో గౌతమ్ అదానీ, సంబంధీకులకు క్లీన్‌చిట్ ఇస్తారన్న వార్తలే ఇందుకు కారణం. ప్రస్తుతం అదానీ పవర్ 19, గ్రీన్ ఎనర్జీ 13, ఎనర్జీ సొల్యూషన్స్ 12, టోటల్ గ్యాస్ 9, NDTV 8, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 8, APSEZ 5, ACC, అంబుజా సిమెంట్స్ 4%, సంఘి ఇండస్ట్రీస్ 3.2% మేర ఎగిశాయి.

Similar News

News November 15, 2025

ఒక్కసారే గెలిచి.. 20 ఏళ్లు సీఎంగా!

image

బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్‌ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. 2000లో తొలిసారి CM పదవి చేపట్టి రాజకీయ అనిశ్చితితో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. తర్వాత 9 సార్లు CM అయ్యారు. 1985లో MLAగా గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ MLCగా ఎన్నికవుతూ CMగా కొనసాగుతున్నారు. ‘నా సీటు గెలవడం పెద్ద విషయం కాదు. మిగతా సీట్లపై దృష్టి పెట్టేందుకే పోటీ చేయను’ అని నితీశ్ చెబుతుంటారు.

News November 15, 2025

రాష్ట్రంలో 60 పోస్టులు

image

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(<>TSLPRB<<>>) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్(MPC,Bi.PC), MSc(ఫిజిక్స్, ఫోరెన్సిక్ సైన్స్,కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, జెనిటిక్స్, బయో కెమిస్ట్రీ, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్), M.Tech, MCA, BSc, BCAఉత్తీర్ణులై ఉండాలి. ఈనెల 27 నుంచి DEC 15వరకు అప్లై చేసుకోవచ్చు.

News November 15, 2025

బహిరంగ ప్రకటన లేకుండా గిఫ్ట్ డీడ్.. పరకామణిలో చోరీపై సీఐడీ

image

AP: పరకామణిలో చోరీ కేసులో నిందితుడు రవికుమార్ టీటీడీకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌పై బహిరంగ ప్రకటన ఎందుకు ఇవ్వలేదని జేఈవో వీరబ్రహ్మంను సీఐడీ ప్రశ్నించింది. టీటీడీకి రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను నిందితుడు గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చారు. ఇష్టప్రకారమే ఇచ్చారా? ఒత్తిడి చేశారా అని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు ఎన్ని నోట్లు దొరికాయి, ఆరోజు లెక్కింపునకు వచ్చిన భక్తుల వివరాలు సేకరిస్తున్నారు.