News November 27, 2024

మేం చెప్పినట్టు అదానీని అరెస్టు చేయాలి: రాహుల్ గాంధీ

image

అమెరికా DOJ అభియోగాలను అదానీ గ్రూప్ ఖండిస్తుందని ముందే ఊహించానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘అభియోగాలను అదానీ అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? కచ్చితంగా అలా చేయరు. అసలు పాయింట్ ఏంటంటే మేం చెప్పినట్టుగా ఆయన్ను అరెస్టు చేయడం. చిన్న చిన్న అభియోగాలకే వందలమంది అరెస్టయ్యారు. రూ.వేలకోట్ల వ్యవహారంలో ఆ జెంటిల్‌మన్ (అదానీ)పై US అభియోగాలు మోపింది. ఆయన జైల్లో ఉండాలి’ అని అన్నారు.

Similar News

News November 27, 2024

షమీని అందుకే రిటెయిన్ చేసుకోలేకపోయాం: నెహ్రా

image

IPLలో తమ జట్టుకు గడచిన రెండు సీజన్లలోనే 48 వికెట్లు తీసిన షమీని గుజరాత్ టైటాన్స్ రిటెయిన్ చేసుకోలేదు. దీని వెనుక కారణాన్ని ఆ జట్టు హెడ్‌కోచ్ నెహ్రా వివరించారు. ‘షమీని రిటెయిన్ చేసుకోవాలనే అనుకున్నాం. కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంతో వదిలేయాల్సి వచ్చింది. వేలంలో ధర రూ.10 కోట్లకు చేరడంతో ఆ ధర మరీ ఎక్కువని భావించాం’ అని వెల్లడించారు. షమీని వేలంలో రూ.10 కోట్లకు SRH దక్కించుకున్న సంగతి తెలిసిందే.

News November 27, 2024

అవును.. నేనో కామన్ మ్యాన్: ఏక్‌నాథ్ శిండే

image

తాను ప్రజా సేవకుడినని, ఎప్పుడూ సీఎంగా భావించలేదని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే అన్నారు. ‘CM అంటే కామన్ మ్యాన్. నేనిలాగే ఫీలవుతా. మేమెప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రజలు ఇంటినెలా నెట్టుకొస్తున్నారో, వారి బాధలేంటో చూశాను. అందుకే లడ్కీ బహన్ స్కీమ్ తీసుకొచ్చాను. PM మోదీ ఎంతో సాయం చేశారు. మా ఇద్దరి విజన్ ఒక్కటే. MVAలో ఆగిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను మేం పూర్తిచేశాం’ అని అన్నారు.

News November 27, 2024

మీ వాట్సాప్ స్టేటస్‌లూ ఇలా మారాయా?

image

వాట్సాప్‌లో రెండ్రోజులుగా కొందరు యూజర్ల స్టేటస్ ట్యాబ్ తంబ్‌నెయిల్స్ మారాయి. ఇప్పటివరకు రౌండ్ తంబ్‌నెయిల్‌పై క్లిక్ చేస్తే స్టేటస్ కన్పించేది. కొత్త UI (యూజర్ ఇంటర్‌ఫేస్)లో స్టేటస్ ఏమిటో యూజర్లందరికీ పెద్దగా కన్పిస్తుంది. ఈ డిజైన్ యూజర్లందరికీ ఇంకా అమలు చేయలేదు. ప్రస్తుతం టెస్టింగ్‌లో భాగంగా కొంత శాతం యూజర్లకు లేటెస్ట్ UI వచ్చిందని సమాచారం. కానీ ఇంతకీ మీకూ ఈ న్యూ ఫీచర్ వచ్చిందా? Do Comment☟