News November 30, 2024
US కేసుపై తొలిసారి స్పందించిన అదానీ

సౌర విద్యుత్ కాంట్రాక్టుకు సంబంధించి ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చినట్లు తనపై నమోదైన కేసుపై వ్యాపారవేత్త గౌతం అదానీ తొలిసారి స్పందించారు. ఇటీవల అమెరికా నుంచి తాము ఆరోపణలు ఎదుర్కొన్నామని, అయితే అలాంటి సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదని ఆయన అన్నారు. తమపై జరిగే ప్రతి దాడి తమను మరింత బలపరుస్తుందని ఆయన జైపూర్లో నిర్వహించిన 51వ జెమ్ అండ్ జువెల్లరీ అవార్డ్స్ కార్యక్రమంలో అన్నారు.
Similar News
News November 6, 2025
నియోనాటల్ పీరియడ్ కీలకం

బిడ్డ పుట్టిన మొదటి 28 రోజులు చాలా క్లిష్టమైన సమయం. దీన్ని నియోనాటల్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా శిశువు ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. నియోనాటల్ పీరియడ్లో బిడ్డకు అనారోగ్యాల ముప్పు తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహించడానికి స్పెషల్ కేర్ అవసరం. బిడ్డను వెచ్చగా ఉంచడం, శ్వాసక్రియ సరిగా ఉండేలా చూడటం, తల్లిపాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటం ముఖ్యమని చెబుతున్నారు.
News November 6, 2025
కష్టాల్లో ఆస్ట్రేలియా

భారత్తో నాలుగో టీ20లో 168 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మార్ష్ 30, షార్ట్ 25, ఇంగ్లిస్ 12, డేవిడ్ 14, ఫిలిప్పీ 10 రన్స్కే ఔట్ అయ్యారు. భారత బౌలర్లు అక్షర్, దూబే చెరో 2 వికెట్లతో అదరగొట్టారు. అర్ష్దీప్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం ఆసీస్ విజయానికి 36 బంతుల్లో 69 రన్స్ అవసరం.
News November 6, 2025
SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కేరళ

EC చేపట్టిన SIRపై TN బాటలోనే కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా SCని ఆశ్రయించనుంది. అఖిలపక్ష సమావేశంలో CM పినరయి విజయన్ దీన్ని వెల్లడించారు. BJP మినహా ఇతర పక్షాలన్నీ దీన్ని ఆమోదించాయి. 2024 లోక్సభ ఎన్నికల ఓటర్ల జాబితా రెడీగా ఉన్నా EC 2002 నాటి జాబితా ప్రకారం SIR నిర్వహించబోవడాన్ని తప్పుబట్టాయి. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని పేర్కొన్నాయి. EC ఇలా చేయడం వెనుక రహస్యాలున్నట్లేనని ధ్వజమెత్తాయి.


