News May 23, 2024

‘సెన్సెక్స్ 30’లోకి అదానీ ఎంట్రీ.. విప్రో ఔట్!

image

BSE సెన్సెక్స్ టాప్ 30 స్టాక్స్‌లో విప్రో స్థానాన్ని అదానీ ఎంటర్‌ప్రైజెస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఎంట్రీతో మార్కెట్‌లోకి $118 మిలియన్ల (రూ.982కోట్లు) ఫండ్స్ రావొచ్చని IIFL ఆల్టర్నేటివ్ రీసెర్చ్ వెల్లడించింది. మరోవైపు విప్రో వైదొలిగితే $56 మిలియన్లు (రూ.466కోట్లు) కోల్పోవచ్చని అంచనా వేసింది. అదానీ గ్రూప్‌ నుంచి ‘సెన్సెక్స్ 30’లో చేరిన తొలి కంపెనీగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిలవనుంది.

Similar News

News February 20, 2026

బెంగాల్ SIR పర్యవేక్షణకు ప్రత్యేక బృందం

image

బెంగాల్‌లో కొనసాగుతున్న SIRను పర్యవేక్షించేందుకు ప్రస్తుత లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ మాజీ జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ జుడీషియల్ ఆఫీసర్ల నియామక బాధ్యతలను కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు అప్పగించింది. బెంగాల్ ప్రభుత్వం, భారత ఎన్నికల కమిషన్ మధ్య ట్రస్ట్ గ్యాప్ ఏర్పడిందని, దీంతో ఈ ప్రక్రియ సజావుగా సాగించేందుకు ఇదొక్కటే ప్రత్యామ్నాయమని ధర్మాసనం అభిప్రాయపడింది.

News February 20, 2026

ఎనిమిదేళ్లకే ఇంత టాలెంటా!

image

రణవీర్ సచ్‌దేవా(8) అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 4 ఏళ్లకే నాసా వెబ్‌సైట్‌లో చోటు సంపాదించిన ఈ బుడతడు.. 5 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన ‘యాపిల్ ప్రోగ్రామర్‌’గా గుర్తింపు పొందాడు. 6 ఏళ్లకే ‘టెడెక్స్’ స్పీకర్‌గా రికార్డు సృష్టించాడు. పర్యావరణంపై తనకున్న అవగాహనతో ‘గ్రీన్ యోధా’గా నిలిచాడు. తాజాగా ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ సమ్మిట్’లో కీనోట్ స్పీకర్‌గా ప్రపంచ నాయకుల దృష్టిని ఆకర్షించాడు.

News February 20, 2026

USతో ట్రేడ్ డీల్.. ఏప్రిల్ నుంచి అమల్లోకి: పీయూష్ గోయల్

image

IND-US ట్రేడ్ డీల్‌పై మార్చిలో సంతకాలు జరుగుతాయని, APR నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. FEB 23 నుంచి 25 వరకు 2 దేశాల అధికారులు వాషింగ్టన్‌లో సమావేశమై డీల్ తొలి దశకు ఆమోదం తెలుపుతారన్నారు. ఢిల్లీలో జరిగిన AI సమ్మిట్‌లో ఆయన US రాయబారి సెర్గియోతో సమావేశమయ్యారు. UK, ఒమన్‌తో డీల్స్ APR నుంచి, న్యూజిలాండ్‌తో ఒప్పందం SEPలో అమల్లోకి రావొచ్చని గోయల్ పేర్కొన్నారు.