News February 8, 2025
అదానీ మంచి మనసు.. రూ.10,000 కోట్ల డొనేషన్
కుమారుడు జీత్ అదానీ-దీవా షాల పెళ్లి సందర్భంగా వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మంచి మనసు చాటుకున్నారు. సేవా కార్యక్రమాలకు రూ.10,000 కోట్లు వెచ్చిస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారని వెల్లడించాయి. ‘సేవ చేయడమే భక్తి, సేవే ప్రార్థన, సేవే పరమాత్మ’ అనేది అదానీ ఫిలాసఫీ అని పేర్కొన్నాయి.
Similar News
News February 8, 2025
ఆప్ ఓటమి.. స్వాతి మాలీవాల్ ట్వీట్ వైరల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా కేవలం ‘ద్రౌపది వస్త్రాపహరణం’ ఫొటోతో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అని, ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అని, ఎంతో కష్టపడి బీజేపీని గెలిపించారని కామెంట్స్ చేస్తున్నారు. స్వాతి కష్టాన్ని బీజేపీ గుర్తిస్తుందని అంటున్నారు.
News February 8, 2025
బీజేపీ గెలుపుతో కేటీఆర్‌కు ఆనందం: మంత్రి పొన్నం
TG: ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపే <<15396872>>KTR<<>>కు చాలా ఆనందం కలిగిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేసుల నుంచి విముక్తి పొందాలని బీజేపీ భజన చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని ఏలుతామని పార్టీ పేరు మార్చుకున్న బీఆర్ఎస్ ఢిల్లీ ఎన్నికల సమయంలో ఎక్కడికి పోయిందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్ నాయకులు శునకానందం పొందారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
News February 8, 2025
BJPకి ఓట్ల వర్షం.. 27 ఏళ్ల కల నెరవేరిన వేళ
PM మోదీ ‘డబుల్ ఇంజిన్’ నినాదం పని చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలో BJP 27 ఏళ్ల కల నెరవేరింది. 1998లో BJP చివరి CMగా సుష్మాస్వరాజ్ పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఆప్‌లే దేశ రాజధానిని ఏలాయి. ఆప్ అగ్రనేతలపై అవినీతి మచ్చ, కాంగ్రెస్ ప్రభావం లేకపోవడం ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చాయి. ప్రజలకు ఉపయోగపడే పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తామని చెప్పడంతో BJPకి ఓట్ల వర్షం కురిసింది.