News December 12, 2024
అదానీకి రూ.27వేల కోట్ల లాభం.. షేర్ల జోరు
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు జోరుమీదున్నాయి. ఇవాళ ఒక్కరోజే గ్రూప్ విలువ రూ.27వేల కోట్ల మేర పెరిగింది. రాజస్థాన్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ 250MW సోలార్ పవర్ ప్రాజెక్టును ఆరంభించింది. కంపెనీ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 11,434MWకు పెరగడంతో ఈ షేర్లు 7.1% లాభపడి రూ.1229 వద్ద చలిస్తున్నాయి. అదానీ పవర్ 5.6, ఎనర్జీ సొల్యూషన్స్ 3, టోటల్ గ్యాస్ 2.3, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.7, NDTV 1.7% మేర ఎగిశాయి.
Similar News
News December 12, 2024
రోహిత్ శర్మ టెస్టులకు పనికిరాడు: మాజీ క్రికెటర్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలో హీరో, విదేశాల్లో జీరో అని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ ఎద్దేవా చేశారు. ఫ్లాట్ ట్రాక్‌లపై మాత్రమే ఆయన ఆడతారన్నారు. ‘రోహిత్ ఫిట్‌గా కనిపించడం లేదు. కోహ్లీ ఫిట్‌నెస్‌తో పోలిస్తే హిట్‌మ్యాన్ చాలా వెనుకబడ్డారు. ఆయన అధిక బరువుతో సతమతమవుతున్నారు. 5 రోజుల పాటు సాగే టెస్టుల్లో ఆడేందుకు రోహిత్ పనికిరాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News December 12, 2024
జమిలి ఎన్నికలతో ఎవరికి ఎఫెక్ట్?
జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకుల వాదన. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికతో జాతీయ పార్టీలకు ప్రాధాన్యం ఏర్పడి స్థానిక పార్టీలు పత్తా లేకుండా పోతాయని చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీనే రాష్ట్రాల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికలతో స్థానిక అంశాలు, సమస్యలు మరుగునపడుతాయని చెబుతున్నారు.
News December 12, 2024
కూటమి పాలనకు 6 నెలలు.. మీ కామెంట్
APలో కూటమి అధికారం చేపట్టి నేటికి 6 నెలలు పూర్తయ్యాయి. పెన్షన్ల పెంపు, ఫ్రీ గ్యాస్, అన్న క్యాంటీన్లు, అమరావతిలో అభివృద్ధి, రోడ్లకు మరమ్మతులు, విశాఖకు TCS, ₹60వేల కోట్ల BPCL రిఫైనరీ, ₹1.40 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ సహా ఎన్నో చేశామని కూటమి అంటోంది. కక్ష సాధింపులు, అక్రమ కేసులు, అత్యాచారాలు, విద్యుత్ ఛార్జీల పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సూపర్-6 అమలు కావడం లేదనేది YCP వాదన. ఈ పాలనపై మీ కామెంట్?