News August 5, 2024

అదానీ వార‌సులు ఆన్ ద వే

image

అదానీ గ్రూప్ ఛైర్మ‌న్ గౌత‌మ్ అదానీ 70 ఏళ్లకు రిటైర్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 62 ఏళ్ల అదానీ తన త‌రువాతి తరం కోసమే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు బ్లూమ్‌బర్గ్‌కు తెలిపారు. ఆయ‌న కుమారులు క‌ర‌ణ్‌, జీత్‌ల‌తోపాటు వీరి క‌జిన్స్ ప్ర‌ణవ్, సాగ‌ర్‌లు ఆ బాధ్య‌త‌లు తీసుకుంటార‌ని వెల్ల‌డించారు. Infra, Ports, సిమెంట్‌, షిప్పింగ్‌, గ్రీన్ ఎన‌ర్జీ, ఎయిర్‌పోర్ట్స్ రంగాల్లో గ్రూప్ విస్త‌రించింది.

Similar News

News November 27, 2025

రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: చంద్రబాబు

image

AP: అమరావతిని రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని CM చంద్రబాబు తెలిపారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును పొడిగించే అంశంపై కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. ‘అమరావతి అభివృద్ధి చెందాలి. ఈ ఫలాలను ఇక్కడి రైతులే ముందు అందుకోవాలి. వారికి న్యాయం చేయడం నా బాధ్యత. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌లో భూములు తీసుకుని అభివృద్ధి చేద్దామని చూస్తున్నాం’ అని రాజధాని రైతులతో మీటింగ్‌లో పేర్కొన్నారు.

News November 27, 2025

ఇక పీరియడ్ బ్లడ్‌తో క్యాన్సర్ గుర్తించొచ్చు!

image

దేశంలో ఏటా 77వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోతున్నారు. దీనికి కారణం నొప్పిని కలిగించే PAP స్మియర్ వంటి పరీక్షలకు భయపడి మహిళలు చెక్ చేయించుకోకపోవడమే. ఈ నేపథ్యంలో అసౌకర్యాన్ని, అధిక ఖర్చును దృష్టిలో ఉంచుకుని వైభవ్ శితోలే బృందం ‘M-STRIP’ అనే స్వీయ పరీక్ష పరికరాన్ని అభివృద్ధి చేసింది. పీరియడ్ బ్లడ్‌తో పరీక్ష చేసుకుంటే ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

News November 27, 2025

తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష

image

TG: తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై సమీక్షించిన సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ‘ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించుకోవాలి. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి’ అని తెలిపారు.