News February 21, 2025

ADBకు చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్

image

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు.  పర్యటనలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆమెకు పెన్ గంగా గెస్ట్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ రాజర్షి షా పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం కాసేపు ఇరువురు పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులున్నారు.

Similar News

News December 22, 2025

మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన జోగు రామన్న

image

ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో మాజీ మంత్రి జోగురామన్న కలిశారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కోరారు. అదేవిధంగా చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి పనులను త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు జోగురామన్న తెలిపారు.

News December 21, 2025

ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి యథాతథం

image

ఈ సోమవారం (22 వ తేదీ) నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News December 20, 2025

బ్లాక్ మెయింగ్‌కి పాల్పడితే సంప్రదించండి: ADB SP

image

మహిళలకు గతంలో జరిగిన వాటిని అడ్డుగా పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్న సందర్భాలలో నిర్భయంగా షీ టీం బృందాన్ని సంప్రదించవచ్చని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గతంలో ప్రేమించి, ప్రస్తుతం ఆ యువకులచే వేధింపబడుతున్న మహిళలు నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. షీ టీం అండగా ఉంటూ సహాయాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఆపద వస్తే 8712659953 నంబర్‌కు సంప్రదించాలన్నారు.