News April 10, 2025
ADBలో ఏడుగురి అరెస్ట్: CI

ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. శాంతినగర్‌లో CCS ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారని ADB ఒకటో పట్టణ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.2,620 నగదు, ఒక బైక్, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 1, 2025
భీంపూర్‌లో పులి సంచారం

భీంపూర్ మండలంలో పులి సంచారం రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. శనివారం ఉదయం పిప్పల్ కోటి, గూడ గ్రామాల శివారులోని యాల్ల కేశవ్, పొగుల రమేశ్ పంట పొలాల్లో పులి కనిపించింది. గమనించిన కూలీలు భయంతో ఇంటికి వెళ్లిపోయినట్లు గ్రామస్థలుు తెలిపారు. కాగా ప్రస్తుతం పులి గర్భం దాల్చినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు.
News November 1, 2025
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించాలి

ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.
News November 1, 2025
ఆదిలాబాద్: నూతన డీఈఓగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు

ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌ను నియమిస్తూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వలు జారీ చేశారు. ప్రస్తుత డీఈవోగా పని చేస్తున్న ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా పర్సనల్ సెలవుల్లో వెళ్లునున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావుకు నవంబర్ 4 నుంచి ఇన్‌ఛార్జి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.


