News February 4, 2025

ADBలో రేపు 2 జాబ్‌మేళాలు

image

ADBలోని 1 టౌన్ PS ఎదుటనున్న ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్‌, శాంతినగర్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న జాబ్ మేళాలు జరగనున్నాయి. ఆర్ట్స్‌లో అప్ గ్రేడ్ ఆధ్వర్యంలో HDFC, AXIS బ్యాంక్, ముత్తూట్ ఫిన్ కార్ప్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేయనున్నారు. సైన్స్‌లో TSKC ఆధ్వర్యంలో TASK సహకారంతో MALE అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Similar News

News November 27, 2025

ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సై..!

image

ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. నేటి (గురువారం) నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు, 3,822 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ శనివారం వరకు కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలించి, అర్హత జాబితాను అధికారులు వెల్లడిస్తారు. బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

News November 27, 2025

ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

image

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.