News July 12, 2024
ADB: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వార చేపడుతున్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలకు రహదారులు కోతకు గురైన వాటి వివరాలు, నిర్మాణ పనుల తీరును ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
Similar News
News November 11, 2025
సజావుగా సాగుతున్న పంటల కొనుగోళ్ల: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభమై కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వరి, పత్తి, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు కలిసి నిర్వహించిన కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 11 పత్తి కొనుగోలు కేంద్రాలు, 33 జిన్నింగ్ మిల్లులు ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు.
News November 10, 2025
ఆదిలాబాద్: సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎస్పీ

ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల రోజును ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎస్పీని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు.
News November 10, 2025
ఆదిలాబాద్: PGలో స్పాట్ అడ్మిషన్లు

ADB పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.జే సంగీత, పీజీ కోఆర్డినేటర్ డా. రాజ్ కుమార్ తెలిపారు. తుది విడత పీజీ అడ్మిషన్లలో బోటనీలో 40, జువాలజీలో 56 అడ్మిషన్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్లో సీటు వచ్చిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని పేర్కొన్నారు.


