News November 3, 2024
ADB: అస్వస్థతతో హెడ్ కానిస్టేబుల్ మృతి
అస్వస్థతతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బోథ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి మావల మండలం వాఘాపూర్‌లోని తన ఇంటి వద్ద ఆదివారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులను డీఎస్పీ జీవన్ రెడ్డి పరామర్శించారు.
Similar News
News November 25, 2024
దహేగాంలో ట్రాక్టర్ కింద పడి ఐదేళ్ల బాలుడు మృతి
ట్రాక్టర్ కింద పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన దహేగాం మండలంలో చోటుచేసుకుంది. దేవాజిగూడకు చెందిన కృష్ణయ్య, వనిత దంపతుల కుమారుడు రిషి (5) ఆదివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా పత్తి లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ టైర్ బాలుడి పైనుంచి వెళ్లడంతో రిషి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News November 25, 2024
నర్సాపూర్(జి)లో 11ఏళ్ల బాలికపై లైంగికదాడికి యత్నం
బాలిక(11)పై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి యత్నించిన ఘటన నర్సాపూర్ (జి)లో ఆదివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బాలికకు తామర పువ్వులు కోసి ఇస్తామని చెప్పి బసంత చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారు. ఆమె అరవడంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI వెల్లడించారు.
News November 25, 2024
చెన్నూర్: మాలలు ఐక్యంగా ఉద్యమించాలి: ఎమ్మెల్యే వివేక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన మాలల మహా గర్జన సభకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా మాలలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.