News May 4, 2024

ADB: ఆద‌ర్శంగా నిలుస్తున్న ఆ ఎమ్మెల్యే

image

సర్కారు దవాఖానకు నేను రాను అనేది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు సర్కారీ దవాఖానలలో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తాయని, ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా MLA వెడ్మ బొజ్జు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు జబ్బు చేస్తే స్వయంగా ప్రభుత్వ ద‌వ‌ఖానాకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. తాజాగా తన తండ్రి భీంరావు ద‌వ‌డ‌కు క్యాన్స‌ర్ కావ‌డంతో ఆయన ఆదిలాబాద్ రిమ్స్ లో చేర్పించి శ‌స్త్ర చికిత్స చేయించారు

Similar News

News December 18, 2025

ఆదిలాబాద్: ప్రమాణ స్వీకార పత్రం ఇదే..!

image

ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడతలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఇటీవల పంచాయతీ రాజ్ ఈనెల 20న ప్రమాణ స్వీకారానికి ఇచ్చిన తేదీని 22న మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణానికి పత్రం విడుదల చేసింది. విజయోత్సవ ర్యాలీల కోసం గెలుపొందిన వారు సిద్ధంగా ఉన్నారు.

News December 18, 2025

ఆదిలాబాద్‌: స్కూలు వేళల్లో మార్పు

image

చలి తీవ్రత నేపథ్యంలో పాఠశాలల పనివేళలను మారుస్తూ కలెక్టర్‌ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 9:40 గంటల- సాయంత్రం 4:30గం. వరకు పాఠశాలలు కొనసాగుతాయన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

News December 17, 2025

ఒక్క ఓటుతో మూత్నూర్ తండా సర్పంచ్‌గా జాదవ్ రాంజీ

image

గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్ తండా గ్రామ సర్పంచ్‌గా జాదవ్ రాంజీ నాయక్ విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 1 ఓటు తేడాతో గెలుపొందారు. ప్రజల సమస్యల పరిస్కారానికి తన వంతు కృషి చేస్తూ.. ప్రతి క్షణం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.