News May 11, 2024
ADB: ఆదర్శ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

అదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడ ఆదర్శ కళాశాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్ (2024-25) లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు
ఉమ్మడి జిల్లా కన్వీనర్ సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రతిని తగిన ధ్రువపత్రాలతో కళాశాలలో సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 9, 2025
ఆదిలాబాద్: ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ సునీల్ వివరాల ప్రకారం.. స్థానిక సీసీఐ ఫ్యాక్టరీ వద్ద శనివారం వాహనాల తనిఖీ చేస్తున్న సందర్భంగా రెండు ద్విచక్రవాహనాలపై అనుమానాస్పదంగా వెళుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రదీప్, జగేశ్వర్ ను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. చోరీ చేసినట్లు అంగీకరించారన్నారు. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
News February 9, 2025
ఆదిలాబాద్: మహిళలకు GOOD NEWS.. 11న జాబ్ మేళా

ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11 TASK ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన GLITZ CORP ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.అతీక్ బేగం పేర్కొన్నారు. 10, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకున్న మహిళ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15వేల జీతంతో పాటు, భోజనం, రవాణా సౌకర్యం, వసతి నెలకు అలవెన్స్ ఉంటుందన్నారు.
News February 9, 2025
ADB: నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

ఆదిలాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన మేకల రాములు పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ కు చెందిన సాజిద్ ఆటోలో ఎక్కి ఓ ఆసుపత్రి వద్ద దిగిపోయాడు. అయితే ఆటోలోనే తన బ్యాగును మరచిపోయాడు. ఆటో డ్రైవర్ బ్యాగును గమనించి వన్ టౌన్ లో అప్పగించాడు. సీఐ సునిల్ కుమార్ బాధితుడిని గుర్తించి ఆ బ్యాగును బాధితునికి అప్పగించి ఆటో డ్రైవర్ సాజిద్ ను అభినందించారు.