News October 22, 2024

ADB: ఆదివాసీ కొదమసింహం ‘కొమరం భీమ్’

image

జల్ జంగల్ జమీన్ నినాదంతో నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమ వీరుడు కొమరం భీమ్. ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలపై నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన కొదమ సింహం, చరిత్ర మరువని యోధుడు కొమురం భీం. జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసులను ఏకం చేసి హక్కుల కోసం పోరాటం చేసిన మహా నాయకుడు. నేటికీ కుమరం భీమ్ ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసీలు తమ హక్కుల సాధనకై పోరాటాలు కొనసాగిస్తున్నారు. 

Similar News

News November 22, 2025

ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

image

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.

News November 22, 2025

నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

image

నార్నూర్‌లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్‌లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.