News July 8, 2024

ADB: ఆదివాసీ గ్రామాల్లో సంబురాలు

image

ఆదివాసీలు ప్రతి ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే అకాడి వేడుకలను నిన్న భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, తిర్యాణి పలు మండలాల్లోని ఆదివాసీలు అడవీకి వెళ్లి వన దైవానికి మహాపూజ చేశారు. మక్క ఘట్కతో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించారు. ఊర్లోని ఆవులన్నింటినీ అడవీలో ఊరేగించారు. గ్రామస్థులంతా ఒకచోట చేరి సామూహిక వనభోజనాలు చేశారు. ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి.

Similar News

News December 10, 2024

రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ సమావేశం

image

గ్రామ పంచాయితి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించామన్నారు.

News December 10, 2024

నిర్మల్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ చర్యలు

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

News December 10, 2024

తాండూరు: ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

image

కుటుంబసభ్యులంతా ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన తాండూరు మండలంలోని కాసిపేట గ్రామంలో జరిగింది. మొండయ్య(60), శ్రీదేవి(50) దంపతులు, వారి కుమార్తె చిట్టి(30), కుమారుడు శివప్రసాద్ (26) ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగు మందు తాగారు. కాగా వారిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.