News August 20, 2024

ADB: ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులు

image

ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి (30) లైంగికంగా వేధించిన ఘటన ఆదిలాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాల ప్రకారం.. బాలిక తన తండ్రితో కలిసి దుకాణానికి వచ్చింది. తండ్రి కొనుగోళ్లు చేస్తూ ఉండగా అక్కడే ఉన్న బాలికను నిందితుడు లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. గమనించి తండ్రి అతడిని మందలించి వన్ టౌన్‌లో ఫిర్యాదు చెయ్యగా ఆదివారం రాత్రి నిందితునిపై పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News February 15, 2025

జన్నారం: స్వగ్రామానికి చేరిన మల్లేశ్ మృతదేహం

image

ఇటీవలే ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందిన జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేశ్ మృతదేహం శనివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కవ్వాల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మృతదేహంపై పడి భార్య రోదిస్తుంటే గ్రామంలోని వారందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ గల్ఫ్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.

News February 15, 2025

నిర్మల్: విద్యార్థిని ఆత్మహత్య

image

HYD పోచారం IT కారిడార్ PS పరిధిలో నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని గ్రామానికి చెందిన అంకిత(21) ఎస్సీ కార్పొరేషన్‌లో ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం హాస్టల్‌లోని గదిలో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 15, 2025

ఆదిలాబాద్: ఎక్కడ చూసినా అదే చర్చ

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ ఎక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

error: Content is protected !!