News June 27, 2024
ADB: ఆశల పల్లకిలో MLAలు.. మంత్రి పదవి ఎవరికో..?

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రి పదవి ఊరిస్తోంది. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రెండో విడత జరగబోతోందనే ప్రచారం నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి విడత కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా సీతక్క వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఎవరిని పదవి వరిస్తుందోననే ఆత్రుత నెలకొంది.
Similar News
News February 19, 2025
ADB: వివాహేతర సంబంధమే కారణం!

బావను బావమరిది <<15502338>>హత్య<<>> చేసిన ఘటన తలమడుగులో మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. CI ఫణిందర్ వివరాలు.. ADB లోని తంతోలికి చెందిన మహేందర్(40)కు రుయ్యాడికి చెందిన నవితతో వివాహమైంది. కాగా కొన్నిరోజులుగా మహేందర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో నిన్న అశోక్ ఇంటికి వచ్చి మహేందర్‌కు నచ్చజెప్పేందుకు చూశాడు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరగడంతో అశోక్ తన బావను కత్తితో పొడిచి హత్య చేశాడు.
News February 19, 2025
యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో ADB బిడ్డల ప్రతిభ

హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న 11వ రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో మంగళవారం మొదటి రోజు ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు నాలుగు పతకాలు కైవసం చేసుకున్నారు. అనిల్, రాణి సిల్వర్ మెడల్ సాధించగా, అరుణ, సక్కు కాంస్యం మెడల్స్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేష్ తెలిపారు. క్రీడల్లో మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
News February 19, 2025
ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు

ప్రేమ పేరుతో లోబరుచుకొని తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన యువకుడిపై బోథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన యువతిని నారాయణపూర్ గ్రామానికి చెందిన జాదవ్ నవీన్ ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని ఆ యువతి ఒత్తిడి తేవడంతో నిరాకరించాడు. దీంతో అతనిపై అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.