News March 6, 2025
ADB: ఆ తల్లిదండ్రులకు తీరని శోకం

కూతురు పుట్టిందని మురిసిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.. అమ్మానాన్న అంటూ పిలిచిన గొంతు నేడు వినిపించడం లేదు.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు కళ్ల ముందు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం.ADB రూరల్(M) లోకారికి చెందిన మహేశ్, లావణ్య దంపతుల కూతురు మనీషా(3)కు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా బుధవారం చికిత్స పొందుతూ చనిపోయింది.
Similar News
News November 3, 2025
ఏలూరు: 15 నిమిషాల్లో బాలిక గుర్తింపు

ఏలూరు రూరల్ పోలీసులు తప్పిపోయిన బాలికను 15 నిమిషాల్లో కనుగొన్నారు. సోమవారం మాదేపల్లి గ్రామం నుంచి డయల్ 112కు బాలికలు కనబడుటలేదని అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన రూరల్ పోలీసులు తప్పిపోయిన 12 ఏళ్ల బాలికను సురక్షితంగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఎస్సై నాగబాబు, సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ అభినందించారు.
News November 3, 2025
అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3వేల కోట్ల ఆస్తులు అటాచ్

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన రూ.3వేల కోట్లకుపైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఆయన నివాసంతో పాటు ముంబై, ఢిల్లీ, నోయిడా, పుణే, హైదరాబాద్, చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోని కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.3,084 కోట్లు అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
News November 3, 2025
బస్సు ప్రమాదం.. ప్రభుత్వం పరిహారం ప్రకటన

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అంతకుముందు కేంద్రం <<18184274>>పరిహారం<<>> ప్రకటించింది.


