News March 17, 2025
ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

సహజంగా ఏ రైతైనా పంట తొలికాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. ADBజిల్లా తాంసి మండలం పొన్నారికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలికాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలో ఇలా ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News March 18, 2025
బాక్సాఫీస్ సమరానికి సిద్ధమైన అన్నదమ్ములు?

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే, ఇదేరోజున మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘భైరవం’ కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందని సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పరస్పర ఘర్షణలతో అన్నదమ్ములు వార్తల్లో నిలుస్తుండగా ఒకేరోజు రిలీజైతే మంచు ఫ్యామిలీలో గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఒకేరోజు వస్తే మీరు ఏ సినిమాకు వెళ్తారు?
News March 18, 2025
శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీపై రాజు మాట్లాడుతూ.. అది ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ అనడంతో శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. అయితే దీనిపై రాజు స్పందిస్తూ.. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయమా అంటూ విమర్శించారు.
News March 18, 2025
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. 325 పాయింట్లు లాభ పడిన నిఫ్టీ 22,824 వద్ద ట్రేడ్‌ను ముగించింది. మరోవైపు, 1131 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 75,301 వద్ద ముగిసింది. అశోక్ లేల్యాండ్, వేదాంత, డీఎల్ఎఫ్, జిందాల్ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించాయి.