News April 22, 2025

ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆమీనా షిరీన్

image

ఆర్టీసీ కార్మికుడి కూతురు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. ADB RTCలో రీజినల్ ఆన్లైన్ రిజర్వేషన్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అహమ్మద్ హుస్సేన్ కూతురు ఆమీనా షిరీన్ సెకండియర్‌లో 99శాతం ఉత్తీర్ణత సాధించింది. బైపీసీ విభాగంలో 1000కి 990 మార్కులు సాధించింది. ఆమెకు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు. మన ADB అమ్మాయికి CONGRATULATIONS చెప్పేయండి మరి.

Similar News

News December 19, 2025

22న విపత్తు నిర్వహణపై ‘మాక్ ఎక్సర్సైజ్’

image

జిల్లాలో విపత్తుల నిర్వహణకు యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈనెల 22న నిర్వహించనున్న విపత్తు నిర్వహణ ‘మాక్ ఎక్సర్సైజ్’ను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ప్రకృతి వైపరీత్యాల నివారణ చర్యలపై సీఎస్ శాంతి కుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని అన్నారు.

News December 19, 2025

ADB: ఐటీఐ ముడిసరకు కొనుగోలుకు కొటేషన్ల ఆహ్వానం

image

ఆదిలాబాద్‌, ఉట్నూరు ప్రభుత్వ ఐటీఐ సంస్థలకు అవసరమైన వివిధ వృత్తుల ముడిసరకు సరఫరాకు సీల్డ్‌ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. జీఎస్‌టీ గుర్తింపు పొందిన సరఫరాదారులు 5 రోజుల్లోగా ప్రిన్సిపల్‌ కార్యాలయంలోని బాక్సులో కొటేషన్లు అందజేయాలన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాల కోసం 9866435005 నంబరును సంప్రదించాలని సూచించారు. నాణ్యమైన సరకు సరఫరా చేసే వారికే ప్రాధాన్యం ఉంటుందన్నారు.

News December 19, 2025

ఆదిలాబాద్: పంచాయితీ వద్దు.. పల్లె ప్రగతే ముద్దు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1500 పైగా గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు జరగగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మద్దతుదారులు స్థానాలు దక్కించుకున్నారు. ఎన్నికలు ముగియడంతో గెలిచినవారు, ఓడినవారు రాజకీయాలు చేస్తూ గ్రామాల అభివృద్ధిని విస్మరించొద్దని ప్రజలు పేర్కొంటున్నారు. అందరూ కలిసి స్థానికంగా నెలకొన్న కుక్కలు, కోతుల బెడద తొలగించాలని.. రోడ్ల, మురుగు కాలువల వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.