News March 23, 2025
ADB: ఇంటివద్దకే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఆదిలాబాద్ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. శనివారం ఆమె కౌంటర్‌ను ప్రారంభించారు. భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకుంటే కార్గో సేవల ద్వారా మీ ఇంటి వద్దనే తలంబ్రాలు అందజేస్తామన్నారు.
Similar News
News March 28, 2025
ADB: ప్రతి పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ల పాత్ర కీలకమైంది: ఎస్పీ

ప్రతి పోలీస్ స్టేషన్ నందు రిసెప్షన్ సెంటర్ల పాత్ర కీలకంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న రిసెప్షనిస్టూలతో సమావేశం ఏర్పాటు చేసి, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా కృషి చేయాలన్నారు.
News March 28, 2025
ADB: తెలుగు నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముద్రించిన పంచాంగాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆదిలాబాద్‌లో శుక్రవారం కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నూతన పంచాంగాన్ని ఆవిష్కరించి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమితి ప్రతినిధులు ప్రమోద్ కుమార్, పడకంటి సూర్యకాంత్, బండారి వామన్, కందుల రవీందర్ తదితరులు ఉన్నారు
News March 28, 2025
ఇచ్చోడ: ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన ఇచ్చోడలోని నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. SI పోలీసుల వివరాలు.. బోథ్ మండలం సాకేరాకి చెందిన ధనుశ్(12) తల్లి లక్ష్మితో కలిసి బుధవారం బంధువుల ఇంటికి ఫంక్షన్‌కు వచ్చాడు. గురువారం ఉదయం తోటి పిల్లలతో కలిసి ఊరి బయట ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోవడంతో మృతి చెందాడు. తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.