News July 16, 2024
ADB: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అదిలాబాద్ డిఈఓ ప్రణీత పేర్కొన్నారు. జలై 15 వరకు గడువు ఉండగా, ఈ నెల 21 వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. కావున జిల్లాలోని ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత ఆన్‌లైన్ పేమెంట్ కాపీతో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
Similar News
News October 16, 2024
ADB: త్వరలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క
చాలకాలంగా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ సహా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, తదితరులు పాల్గొన్నారు.
News October 16, 2024
గాదిగూడ ఎస్ఐ మహేశ్‌పై కేసు నమోదు
రోడ్డు ప్రమాదానికి కారణమైన గాదిగూడ ఎస్ఐ మహేశ్‌పై కేసు నమోదైంది. వివరాలు ఇలా.. ఈ నెల 11న లోకారి గ్రామం వద్ద షేక్ అతిఖ్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా SI తన కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతిఖ్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతని కుటుంబీకులు శనివారం ఆదిలాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. న్యాయం చేయాలని కోరారు. సోమవారం నార్నూర్ సీఐ రహీం పాషాకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
News October 16, 2024
మంచిర్యాల: ఆకాశంలో హనుమంతుని రూపం
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రేచిని గ్రామంలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మబ్బులు హనుమంతుని రూపంలో కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. ఆ దృశ్యంలో ఆంజనేయుడు శంఖం ఊదినట్లుగా కనిపించింది. దీంతో పలువురు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకొన్నారు.