News June 23, 2024
ADB: ఉపాధి హామీ పనుల్లో మహిళలే అధికం
ఉమ్మడి జిల్లాలో 91వేల ఉపాధిహామీ జాబ్ కార్డులు ఉండగా ఏటా పనిచేసే వారు 1.72 లక్షల మంది ఉన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 71వేల జాబ్ కార్డులున్న వారికి పని కల్పించగా దాదాపు 1.29 లక్షల మంది భాగస్వాములయ్యారు. ఇందులో పురుషులు 61వేలు, మహిళలు 68 వేలు ఉన్నారు. కేంద్రం కూలికి రోజు రూ.300 కేటాయిస్తుంది.
Similar News
News November 4, 2024
దిలావర్పూర్: ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్
దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాడనే కారణంతో అరేపల్లి విజయ్ కుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంత కాలంగా ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దిలావర్ పూర్, గుండంపల్లి గ్రామస్థులు, రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.
News November 4, 2024
ఆదిలాబాద్: చిన్నారిని సన్మానించిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కళాకారుడు ద్యావంత్ రమేశ్ కుమారుడు ద్యావంత్ మోక్ష జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన నివాసంలో చిన్నారిని శాలువాతో సన్మానించారు. చిన్న వయసులోనే ప్రతిభ కనబర్చడం అభినందనీయమన్నారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగేశ్, బీజేపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు సాయితేజ ఉన్నారు.
News November 3, 2024
ADB: అస్వస్థతతో హెడ్ కానిస్టేబుల్ మృతి
అస్వస్థతతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బోథ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి మావల మండలం వాఘాపూర్‌లోని తన ఇంటి వద్ద ఆదివారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులను డీఎస్పీ జీవన్ రెడ్డి పరామర్శించారు.