News February 26, 2026
ADB: ఉమ్మడి జిల్లాలో 15 వేల పాసుపుస్తకాలు పెండింగ్

6 నెలలుగా పట్టా పాసుబుక్కులు జారీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ఉమ్మడి ADB జిల్లాలో రోజుకు 75-100 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. డిజిటల్ సిగ్నేచర్ తర్వాత ప్రింటింగ్ ఏజెన్సీ ఇంటి వద్దకే పాసుపుస్తకాలు పంపాలి. ఏజెన్సీకి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ప్రింటింగ్ నిలిపివేసింది. ప్రభుత్వం ఈబాధ్యతలను మరో ఏజెన్సీకి అప్పగించింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 15వేల పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి.
Similar News
News April 19, 2026
మెదక్: ఇంటికి చేరాలి.. షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించిన ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కోసం రూపొందించిన “ఇంటికి చేరాలి…” అనే షార్ట్ ఫిల్మ్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. 99 రోజుల ప్రజా ప్రణాళిక “సురక్షిత ప్రయాణం” కార్యక్రమంలో భాగంగా రూపొందిన ఈ చిత్రం యువతలో మార్పు తీసుకురావడమే లక్ష్యంమని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, జరిమానాలు, శిక్ష కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసం అనే సందేశాన్ని అందిస్తోందని తెలిపారు.
News April 19, 2026
59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారు.. మోదీపై ఖర్గే ఫైర్

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ప్రసంగంలో ప్రధాని 59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారని, మహిళల గురించి మాత్రం తక్కువగా మాట్లాడారని విమర్శించారు. మోదీ ప్రాధాన్యం మహిళలు కాదని, కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అధికారిక వేదికను రాజకీయ విమర్శలకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఆరోపించారు.
News April 19, 2026
ఓడినా పెరిగిన CSK ర్యాంక్.. అదెలా?

IPL: SRHతో మ్యాచ్‌లో ఓడినా పాయింట్ల పట్టికలో CSK ఒక మెట్టు పైకి ఎక్కడం విశేషం. మ్యాచ్‌కు ముందు -0.846 రన్ రేట్‌తో ఎనిమిదో ప్లేస్‌లో ఉన్న చెన్నై కేవలం 10 పరుగుల తేడాతోనే ఓడిపోవడంతో రన్ రేట్ -0.780కి మెరుగైంది. దీంతో లక్నోను వెనక్కి నెట్టి ఏడో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో ఎషాన్ మలింగ యార్కర్లతో కట్టడి చేయగా చివరి ఓవర్‌లో ప్రఫుల్ హింగే అద్భుతంగా బౌలింగ్ చేసి హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.


