News May 12, 2024

ADB: ఎన్నికల విధుల్లో ఒకేచోట SI అన్నదమ్ములు

image

ఆదిలాబాద్ టీటీడీసీ కేంద్రంలో ఈవీఎం మిషన్ల పంపిణీ ఆదివారం చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా మండల పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలు విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చారు. అయితే ఎన్నికల విధుల్లో ఇద్దరు ఎస్ఐలు పాల్గొనగా.. వారిద్దరూ అన్నదమ్ములు అవ్వడం విశేషం. మావల పోలీస్ స్టేషన్ SI విష్ణువర్ధన్, జైనథ్ పోలీస్ స్టేషన్ SI పురుషోత్తం ఇక్కడే విధులు నిర్వర్తించారు. 

Similar News

News February 13, 2025

భీంపూర్‌‌లో చిరుత.. స్పందించిన అధికారులు

image

భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ శివారులో చిరుత పులి కదలిక పై ఎఫ్ఎస్‌వో అహ్మద్ ఖాన్, ఎఫ్‌బీవో శ్రీనివాస్ స్పందించారు. నిపాని శివారులోని లింగారెడ్డి అనే రైతుకు చెందిన పంట చేనులో చిరుత పులి సంచారం సీసీ కెమెరాలో రికార్డయిందన్నారు. గురువారం పంట చేనుకు వెళ్లి పరిశీలించారు. రైతులెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News February 13, 2025

ADB: వ్యక్తిపై లైంగిక దాడి కేసు

image

తనను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ADB 1 టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. తల్లిగారింటి వద్ద ఉంటున్న ఓ వివాహిత(24), శాంతినగర్‌కి చెందిన షేక్ ఆసిఫ్‌ 8నెలల పాటు సహజీవనం చేశారు. కాగా తనను ఆసిఫ్ మోసం చేశాడని, లైంగికంగా వేధించి తన వీడియోలు తీశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆసిఫ్ తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది.

News February 13, 2025

నిర్మల్‌: యువతి దారుణ హత్య.. నిందితుడికి జీవత ఖైదు

image

ఏడాది క్రితం ప్రేమ పేరుతో <<12630813>>యువతిని హత్య<<>> చేసిన వ్యక్తికి నిర్మల్ జిల్లా కోర్టు జీవితకాల శిక్ష, విధించింది. పోలీసులు వివరాలు.. ఖానాపూర్ అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ అదే కాలనీకి చెందిన అలేఖ్యను ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె నిరాకరించడంతో ద్వేషం పెంచుకున్నాడు. ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో విషయం తెలుసుకున్న శ్రీకాంత్ 2024 ఫిబ్రవరి 8న ఆమెను కత్తితో నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు.

error: Content is protected !!