News March 5, 2025
ADB: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో 40 మంది ఎలిమినేట్

కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు.
Similar News
News November 19, 2025
హిడ్మా అనుచరుడు సరోజ్ అరెస్టు!

AP: మావోయిస్టు అగ్రనేత హిడ్మా నిన్న ఉదయం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడం తెలిసిందే. అయితే ఆయన అనుచరుడు మద్వి సరోజ్ కోనసీమ(D) రావులపాలెంలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు గాలింపు చేపట్టి ఈరోజు అరెస్టు చేశారు. రహస్య ప్రాంతంలో ఆయన్ను విచారిస్తున్నారని సమాచారం. కాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సరోజ్ రావులపాలెం ఎందుకు వచ్చాడు? ఎప్పటినుంచి ఉంటున్నాడు? తదితరాలపై ఆరా తీస్తున్నారు.
News November 19, 2025
ఈ ఏడాది 328 రోడ్డు ప్రమాదాల్లో మరణాలు: సీపీ

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది నవంబర్ 18వ తేదీ వరకు వ్యక్తుల మరణాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు 328 జరిగాయని పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 92 ప్రమాదాలు తక్కువగా జరిగాయని ఆయన వివరించారు. నందిగామలోని అనాసాగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో కమిషనర్ ఈ వివరాలను వెల్లడించారు.
News November 19, 2025
చింతూరు: ఆడుతూ స్పృహ తప్పి చిన్నారి మృతి

చింతూరు మండలం కుయుగూరులో చిన్నారి శ్యామల జనని(5) బుధవారం ఆకస్మికంగా మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. బాలిక తోటి పిల్లలతో అంగన్వాడీ కేంద్రానికి వెళుతూ దారిలో ఉన్న రేగుపళ్లు తిని ఆడుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయిందని గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యుల చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్నారు.


