News March 5, 2025

ADB: ఎమ్మెల్సీ కౌంటింగ్.. 23 మంది ఎలిమినేట్

image

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అధికారులు చేయనున్నారు. లెక్కింపునకు ముందు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికి 23 స్వతంత్ర అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Similar News

News October 20, 2025

టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేక్!

image

దీపావళికి ఒక్కరోజు ముందే టీమ్ఇండియా(M&W) క్రికెట్ జట్లు ఓడిపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేసింది. నిన్న తొలుత పురుషుల జట్టు ఆసీస్‌తో తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత WWCలో భాగంగా జరిగిన కీలక మ్యాచులో మహిళల టీమ్ కూడా పరాజయం చెందడం సగటు అభిమానికి బాధను మిగిల్చింది. గెలవాల్సిన మ్యాచులో హర్మన్ సేన 4 పరుగుల తేడాతో ఓడటం టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు నిజంగా హార్ట్‌బ్రేకే.

News October 20, 2025

509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 341, మహిళలకు 168 జాబ్‌లు ఉన్నాయి. వయసు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. SC, STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://ssc.gov.in

News October 20, 2025

దీపావళి రోజున కచ్చితంగా చేయాల్సిన పనులు

image

లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే ఇష్టం. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచి, ప్రతి మూల దీపాలు వెలిగించి పూజ చేయాలి. పూజ సమయంలో విగ్రహం (లేదా) ఫొటోను ఎర్రటి వస్త్రంపై ఉంచాలి. పూజను తూర్పు (లేదా) ఈశాన్య మూలలో చేయాలి. ఇంటి గుమ్మం వద్ద కుంకుమ, పసుపుతో స్వస్తిక్ వేసి, గడపకు పూజ చేయాలి. ఇది పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది. పూజలో భాగంగా అఖండ దీపం వెలిగిస్తే.. అది మరుసటి రోజు ఉదయం వరకు ఆరిపోకుండా జాగ్రత్త వహించాలి.