News April 27, 2024

ADB: ఏఈ పరీక్ష ఫలితాల్లో జిల్లావాసి ప్రతిభ

image

జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన అల్లూరి సవిత, రాఘవేందర్ రెడ్డిల కుమారుడు రంజిత్ ఏఈ పరీక్ష ఫలితాలు ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 2023 అక్టోబర్‌లో రాసిన పరీక్ష తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్ష ఫలితాల్లో రంజిత్ రాష్ట్రంలో ఏడో ర్యాంకు, జోనల్ స్థాయిలో రెండో ర్యాంకు, బాసర జోన్‌లో మొదటి ర్యాంకు సాధించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.

Similar News

News August 5, 2025

ఆదిలాబాద్: మెగా జాబ్ మేళా.. 296 మందికి నియామకం

image

ఆదిలాబాద్ ఎస్‌టీయూ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ జాబ్ మేళాకు మొత్తం 3,580 మంది అభ్యర్థులు హాజరుకాగా 396 మంది షార్ట్‌లిస్టు అయ్యారన్నారు. వీరిలో 296 మందికి నియామక ఉత్తర్వులు అందజేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కంపెనీలు అభ్యర్థుల వెరిఫికేషన్ అనంతరం అర్హులను ఎంపిక చేశాయని ఆయన వివరించారు.

News August 5, 2025

ఆదిలాబాద్: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

image

ఆదిలాబాద్‌లో మౌనిక అనే యువతి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉట్నూర్‌కు చెందిన ఆమె ఆదిలాబాద్‌లోని ఫుట్‌వేర్ దుకాణంలో ఉద్యోగం చేస్తూ భుక్తాపూర్‌లో అద్దె గదిలో నివాసం ఉంటోంది. కాగా మంగళవారం విధులు నిర్వహించిన అనంతరం గదికి వచ్చి ఉరేసుకుంది. ఇరుగుపొరుగు వారు గమనించడంతో విషయం బయటకు తెలిసింది. మృతదేహాన్ని రిమ్స్ తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది

News August 5, 2025

ఆదిలాబాద్: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

image

తాంసిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్సై వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కీర్తిరాజా గీతేష్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఉపాధ్యాయుడిని రిమాండ్‌కు తరలించారు.