News March 17, 2025

ADB: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు DEO ప్రణీత ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News October 24, 2025

పాదాల పగుళ్లు తగ్గాలంటే..

image

కొందరికి సీజన్‌తో సంబంధం లేకుండా పాదాల పగుళ్లు ఇబ్బంది పెడతాయి. వీటికి ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. రోజూ పాదాలకు నూనె, మాయిశ్చరైజర్, తేనె, కలబంద వంటివి రాస్తుండాలి. అలాగే నిమ్మరసం, ఆలివ్‌ఆయిల్, బ్రౌన్ షుగర్ పేస్ట్ కలిపి పాదాలకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత మసాజ్ చేస్తూ క్లీన్ చేయాలి. పాదాలు ఆరాక మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇలా తరచూ చేస్తే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

News October 24, 2025

రేపే నాగుల చవితి.. శుభ ముహూర్తం ఏదంటే?

image

కార్తీక శుద్ధ చతుర్థి సందర్భంగా రేపు నాగుల చవితి జరుపుకొంటారు. చవితి తిథి రేపు 1:19AM నుంచి ఎల్లుండి 3:48AM వరకు ఉంటుంది. నాగ దేవతల పూజకు శుభ ముహూర్తం రేపు ఉదయం 8:59 గంటల నుంచి 10:25 గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ శుభ సమయంలో పుట్టలో పాలు పోసి, భక్తి శ్రద్ధలతో నాగ దేవతలను ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయంటున్నారు. ప్రకృతి, జంతువుల పట్ల గౌరవానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకొంటారు.

News October 24, 2025

సిద్దిపేటలో ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్ బస్సులు సేఫేనా..?

image

కర్నూల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, స్కూల్ బస్సులు సేఫేనా అన్న ప్రశ్న ప్రజల ఆలోచనల్లో మెదులుతోంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సీరియస్ అయ్యారు. ప్రమాదంపై విచారణ జరపాలని ఆదేశించారు. సిద్దిపేట ప్రైవేట్, స్కూల్ బస్సులపై ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలంటున్నారు.