News April 4, 2025

ADB: ‘ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలి’

image

ఓపెన్ స్కూల్ సోసైటి ద్వారా జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ కే.శ్యామలాదేవి అన్నారు. గురువారం వివిధ పరీక్ష నిర్వహణ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షలకు 623 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 465 మంది హాజరవుతారన్నారు. వీరికి ఏప్రిల్ 20వ తేది నుంచి ఏప్రిల్ 26 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Similar News

News April 19, 2025

ఇకపై భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం: మంత్రి

image

ఎన్నికల వేల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం లభించనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూ భారతి చట్టంపై భోరజ్ మండలం పూసాయిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రారంభించారు.

News April 19, 2025

ADB: నేడు జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

ప్రభుత్వ మద్దతు క్వింటాలకు రూ.3,371తో జొన్న కొనుగోలుకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. గుడిహత్నూర్ పీఏసీఎస్ఎ ద్వారా ఈనెల 19 నుంచి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కేంద్రాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 18, 2025

ధరణి బంగాళాఖాతంలో కలుపుతాం అంటేనే అధికారంలోకి: పొంగులేటి

image

BRS అమలు చేసిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అన్నందుకే రైతులు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భోరజ్ మండలం పుసాయిలో శుక్రవారం జరిగిన భూ భారతి కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ధరణి తొలగించి భూ భారతి తెచ్చామని పేర్కొన్నారు.

error: Content is protected !!