News May 23, 2024

ADB: ఐటీడీఏ ఉద్యాన నర్సరీలను అభివృద్ధి చేస్తాం: పీవో

image

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ ఉద్యాన నర్సరీలను బలోపేతం చేయటంతో పాటు అభివృద్ధి చేస్తామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని జంబుగాలో ఉన్న ఐటీడీఏ ఉద్యాన నర్సరీ, శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. నర్సరీ ద్వారా మెరుగైన ఆదాయం పొందటంతో పాటు, దినసరి కూలీలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఓ సూచించారు.

Similar News

News December 11, 2025

ఉట్నూర్: భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్

image

ఉట్నూర్ మండలం లింగోజితండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి జాదవ్ మాయ.. సమీప ప్రత్యర్థి విమలపై 88 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ఆమె భర్త హరినాయక్ వార్డ్ మెంబర్‌గా గెలుపొంది ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో రెండు పదవులు రావడంతో వారి మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు.

News December 11, 2025

ఆదిలాబాద్ జిల్లాలో మహిళదే విజయం

image

ఇచ్చోడ మండల పరిధిలోని 28 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ లత విజయం సాధించారు. ప్రత్యర్థి రాథోడ్ మనోజ్‌పై 50 ఓట్ల తేడాతో రాథోడ్ లత గెలుపొందారు. ఈ గ్రామపంచాయతీలో 8 వార్డు స్థానాలకు సభ్యులను ఎన్నుకున్నారు. .

News December 11, 2025

ఆదిలాబాద్ జిల్లాలో 69.10 శాతం పోలింగ్

image

ఆదిలాబాద్ జిల్లాలో తొలివిడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69.10 శాతం ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో70.38%, సిరికొండ 85.12%, ఇంద్రవెల్లి 57.60%, ఉట్నూర్ 65.95%, నార్నూర్ 78.18%, గాదిగూడలో 78.18% నమోదైంది.
*GP ఎన్నికల అప్డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.