News September 1, 2024
ADB: ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లకు గడువు పొడగింపు
డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై గడువు పొడగించినట్లు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సంగీత తెలిపారు. డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరవచ్చని, AUG 31 వరకు గడువు పూర్తవగా దాన్ని SEP 30 వరకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News September 8, 2024
లోకేశ్వరం: ఎలుకల మధ్యలో గణనాథుడు
లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో మున్నూరు కాపు సంఘం యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడు చూపరులను ఆకట్టుకుంటోంది. ఎలుకలు లంబోదరుడిని ఎగరేసి పట్టుకున్నట్లు ఉండే ఈ విగ్రహాన్ని గ్రామ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 11 రోజులు ప్రత్యేక పూజలు చేసి, అనంతరం గోదావరి నదిలో నిమజ్జనం చేస్తామని యూత్ సభ్యులు తెలిపారు.
News September 7, 2024
కుబీర్: వినాయక చవితికి స్పెషల్ ఈ కర్ర గణపతి
వినాయక చవితికి మహారాష్ట్ర ప్రాంతంలోని పాలజ్ కర్ర గణపతికి ఓ ప్రత్యేకత ఉంది. కుబీర్ సమీపంలో ఉంటే ఈ గణపతిని 1948లో ప్రతిష్ఠించారు. 1948లో పాలజ్‌లో అంటువ్యాధులు ప్రబలి 30మందికి పైగా మరణించారు. ఆ సంవత్సరం వచ్చిన వినాయకచవితికి అక్కడి ప్రజలు నిర్మల్‌లో కొయ్య గణపతిని చేయించి వారి గ్రామంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతిసంవత్సరం నిమజ్జనం చేయకుండా గణపతికి పూజలు చేస్తున్నారు.
News September 7, 2024
నిర్మల్: ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్
ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై మండల తాహశీల్దార్‌లతో ఆమె సమీక్షించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.