News February 18, 2025
ADB: కత్తిపోట్ల ఘటన UPDATE

తలమడుగు మండలం రుయ్యాడిలో ఓ వ్యక్తి <<15500882>>దారుణ హత్య<<>>కు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో బావబామ్మర్దుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో బావ మహేందర్‌పై బామ్మర్ది అశోక్ కత్తితో దాడి చేశాడు. దీంతో మహేందర్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ కలహాలు నేపథ్యంలో హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
Similar News
News March 23, 2025
ఫిలింనగర్: తల్లి డైరెక్షన్‌లో కొడుకుల చోరీ

ఫిలింనగర్ PS పరిధిలో ఇటీవల డైమండ్‌హిల్స్ కాలనీలో 32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ అయింది. లేడీ డాన్ సనా బేగం ఈ చోరీ చేయించి, 10 తులాల బంగారం విక్రయిస్తూ రెండో కొడుకు సొహాయిల్‌తో సహా పట్టుబడింది. మిగిలిన ఇద్దరు కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సనాపై ఇప్పటివరకు 43 చోరీ కేసులు ఉన్నాయి. తల్లి డైరెక్షన్ ఇస్తే కొడుకులు రంగంలోకి దిగి చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
News March 23, 2025
ఉచిత సామూహిక వివాహాలు: రఘువీరా రెడ్డి

మడకశిర మండల పరిధిలోని నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సామూహిక ఉచిత వివాహాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 4వ తేదీలోపు నీలకంఠాపురంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మహిళలకు 18, పురుషులకు 21సంవత్సరాల వయసు నిండినట్లు ఆధారాలను అందజేయాలన్నారు. శాస్త్రోక్తంగా వివాహాలు నిర్వహిస్తామని రఘువీరారెడ్డి తెలిపారు.
News March 23, 2025
పరాయి పాలనపై పోరాటం.. నవ్వుతూనే ఉరికంబం!

భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్ గురు.. ఈ మూడు పేర్లు వింటేనే భారతీయుడి ఒళ్లు పౌరుషంతో పులకరిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ పునాదుల్ని కదిలించడంలో ఈ అమరులది మరచిపోలేని పాత్ర. 1928, డిసెంబరు 17న బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్య, పార్లమెంటుపై బాంబుదాడి ఆరోపణలపై ముగ్గుర్నీ 1931, మార్చి 23న బ్రిటిషర్లు ఉరి తీశారు. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా షహీద్ దివస్‌ను భారత్ ఏటా మార్చి 23న జరుపుకుంటోంది.