News February 13, 2025

ADB: కరెంట్ షాక్‌తో బాలిక మృతి

image

కరెంట్ షాక్‌తో ADBకు చెందిన బాలిక మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన 9వ తరగతి చదువుతున్న తహ్రీం గత నెల 18న తన ఇంటి డాబా పైకి వెళ్లింది. ఈ క్రమంలో డాబాపై నుంచి వెళుతున్న హైఓల్టేజీ విద్యుత్ తీగలతో కరెంట్ సరఫరా కావడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబీకులు రిమ్స్‌కు, అక్కడి నుంచి మహారాష్ట్రలోని వార్ధాకు  ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం బాలిక మృతి చెందింది.

Similar News

News December 15, 2025

జైనథ్: ముచ్చటకు మూడోసారి సర్పంచ్‌గా గెలుపు

image

జైనథ్ మండలం కౌట గ్రామ సర్పంచ్‌గా బోయర్ శాలునా విజయ్ ఘన విజయం సాధించారు. గతంలో సైతం ఆమె సర్పంచ్‌గా పని చేశారు. ఇదిలా ఉంటే ఆమె భర్త బోయర్ విజయ్ సైతం సర్పంచ్ సేవలందించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఈమారు సైతం విజయం సాధించడం విశేషం. ముచ్చటగా మూడోసారి వారు సర్పంచ్‌గా గెలపొందారు. గ్రామాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని గుర్తించే ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారని వారు హర్షం వ్యక్తం చేశారు.

News December 14, 2025

విజయోత్సవ ర్యాలీలు వద్దు: అదనపు ఎస్పీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్, 223 బీఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల అనుమతితో, నిర్దేశించిన రోజున మాత్రమే ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం బేల, జైనథ్, భీంపూర్, తాంకో, ఆదిలాబాద్(రూ), మావల మండలాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.

News December 14, 2025

ఆదిలాబాద్ జిల్లాలో తొలి ఫలితం

image

సాత్నాల మండలంలోని సాంగ్వి (జి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆత్రం నగేశ్ గెలుపొందారు. ప్రత్యర్థిపై 389 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ నగేశ్‌ను పలువురు అభినందించారు.