News August 8, 2024
ADB కలెక్టర్ క్యాంపు ఆఫీస్ సమీపంలో దొంగతనం

ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. కలెక్టర్ క్యాంపు ఆఫీస్ వద్ద బుధవారం రాత్రి పుండలిక్ అనే వ్యక్తి కిరణ కొట్టులో దొంగతనం జరిగింది. గత రెండు సంవత్సరాలు నుంచి తోపుడు బండిలో కిరణకొట్టు నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా నెల రోజుల్లో రెండు సార్లు దొంగతనం జరిగిందని బాధితుడు వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 6, 2026
అటవీ ప్రాంతాల్లో రోడ్డు పనుల అనుమతులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల మీదుగా ప్రతిపాదించిన రహదారి నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు, పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ సంరక్షణ చట్టాల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అభివృద్ధి పనులు కొనసాగించాలని సూచించారు.
News January 6, 2026
ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు నియమాలు పాటించాలి: డీఎస్పీ

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గూడ్స్ సరుకులు రవాణా చేయవద్దని, ప్రతి బస్సులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపకుండా ఓనర్లు బాధ్యత వహించాలని, రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమానాస్పద ప్రయాణికులు, నిషేధిత పదార్థాలపై అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
News January 6, 2026
నాగోబా జాతరకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ అఖిల్ మహాజన్

కేస్లాపూర్లో ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న నాగోబా జాతర ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతరకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్, రూట్ మ్యాప్ను సిద్ధం చేశామన్నారు. అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఇతర సిబ్బంది ఆయనతోపాటు ఉన్నారు.


