News February 19, 2025

ADB: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

image

ఉమ్మడి ADB, KNR, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

Similar News

News March 19, 2025

ADB: 20న కందులు, శనగల కొనుగోళ్లు బంద్

image

కందులు, శనగలు కొనుగోళ్లను ఈనెల 20న నిలిపివేస్తున్నట్లు ఆదిలాబాద్ సెంటర్ ఇన్‌ఛార్జ్ కేంద్రే పండరి బుధవారం తెలిపారు. కందులు, శనగల నిల్వలు అధికంగా ఉన్నందున కొనుగోళ్లు  జరగవన్నారు. ఈనెల 21 నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

News March 19, 2025

తాంసి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

తాంసి మండల కేంద్రానికి చెందిన కనాకే ప్రసాద్(42) చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు.. తాంసికి చెందిన ప్రసాద్‌కు హోలీన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రసాద్ చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలున్నారు.

News March 19, 2025

రాష్ట్ర బడ్జెట్‌పై ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశలు

image

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ADB జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఉట్నూర్ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా, జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్, స్పిన్నింగ్ వద్ద ఫ్లైఓవర్ పనులకు, చనాక-కొరాట ప్రాజెక్ట్, కుంటాల, పొచ్చర జలపాతాల వద్ద అభివృద్ధి, పర్యాటక రంగానికి, పురాతన ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

error: Content is protected !!