News March 13, 2025

ADB: కామదహనం ఏర్పాట్లు చేస్తున్న ఆదివాసీలు

image

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడ, తండాల్లో గురువారం సుమారు 8 గంటలకు జరిగే కామదహనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ పెద్దలు కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రంగుల పండుగ హోలీని పురస్కరించుకొని జరుగుతున్న ఈ వేడుకలలో కొబ్బరి, నైవేద్యాలతో కూడిన పదార్థాలతో సంబరాలు చేసుకుంటారు. వాటిని వెదురుతో అంటించిన మంటల్లో పెట్టి పోటీలు నిర్వహిస్తారు.

Similar News

News December 12, 2025

ADB: రేపు అన్ని పాఠశాలలకు వర్కింగ్ డే

image

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు రెండవ శనివారం పని దినంగా ఉంటుందని జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 7న సెలవు ప్రకటించినందుకు బదులుగా ఈ నెల 13న అన్ని పాఠశాలలు యథావిధంగా పనిచేయాలని సూచించారు. అన్ని పాఠశాలలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News December 11, 2025

హీరాపూర్‌: కోడలిపై అత్త విజయం

image

ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అత్తాకోడళ్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ రసవత్తర పోరులో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీబాయి 140 ఓట్ల తేడాతో గెలుపొందారు.

News December 11, 2025

ఇచ్చోడ: లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక

image

ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 176 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్‌ను సర్పంచ్‌గా ప్రకటించారు. ఈ విధంగా లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం ఉత్కంఠను రేపింది.