News January 30, 2025

ADB: కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

Similar News

News November 7, 2025

HYD: వీళ్లేం సెలబ్రెటీలు: సీపీ సజ్జనార్

image

అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆద‌ర్శ‌నీయ‌మైన ఆట‌గాళ్లు ఎలా అవుతారని రైనా, ధవన్‌ను ఉద్దేశించి Xలో సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్య‌స‌న‌ప‌రులై వేలాది మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డటానికి వీరు బాధ్యులు కారా అని ప్రశ్నించారు. ‘స‌మాజం, యువ‌త మేలు కోసం నాలుగు మంచి మాట‌లు చెప్పండి. అంతేకానీ అభిమానులను త‌ప్పుదోవ‌ప‌ట్టించి వారి ప్రాణాల‌ను తీయకండి’ అని రాసుకొచ్చారు.

News November 7, 2025

వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక: ఎస్పీ

image

కాకినాడ: స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచిన ‘వందేమాతరం’ గీతం రచనకు ఈ రోజుతో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ, భారతమాత చిత్రపటాలకి ఎస్పీ, పోలీస్‌ అధికారులు పుష్పాంజలి సమర్పించారు. వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక అని వారు అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు.

News November 7, 2025

విశాఖ: పాఠశాలలకు రేపు సెలవు రద్దు

image

విశాఖలో రేపు రెండో శనివారం సందర్భంగా సెలవు రద్దు చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో.. ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్ణయించారు. ఈ మేరకు అన్ని మేనేజ్‌మెంట్‌ల పాఠశాలలు రేపు సాధారణంగా పనిచేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.