News January 30, 2025
ADB: కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.
Similar News
News February 13, 2025
అల్లూరి: ఒకే ఊరు.. రెండు మండలాలు..!

తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని రాజవొమ్మంగి మండలం రాజుపేట గిరిజనులు కోరుతున్నారు. ఐదేళ్లలోపు 32మంది బాలలు ఉన్నారన్నారు. రెండు వీధులుగా ఉన్న తమ గ్రామంలో ఎగువవీధి కొయ్యూరు మండలంలోకి.. దిగువ వీధి రాజవొమ్మంగి మండలంలోకి వస్తుందని చెప్తున్నారు. అనేకసార్లు రెండు మండలాల అధికారులకు విన్నవించుకున్నామని తెలిపారు. చేసేదిలేక చిన్నారులను పనుల వద్దకు తీసుకుపోతున్నామని తమ ఆవేదనను వెలిబుచ్చుకున్నారు.
News February 13, 2025
19న BRS విస్తృతస్థాయి సమావేశం

TG: ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని KCR నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవాలు, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై KCR అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేయనున్నారు.
News February 13, 2025
భద్రాద్రిలో విషాదం.. ఇద్దరి దుర్మరణం (UPDATE)

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద లారీ, బైక్ ఢీకొన్న ఘోర <<15448249>>రోడ్డు ప్రమాదం<<>>లో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు చింతగుప్ప పరిధిలోని సుజ్ఞానాపురం గ్రామానికి చెందిన భూక్యా హరిబాబు(40), భూక్యా సోమ్లా(36) లుగా గుర్తించారు. అకాల మరణంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.