News January 30, 2025

ADB: కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

Similar News

News September 19, 2025

తెరపైకి బూచేపల్లి.. అసలేం జరుగుతోంది?

image

మద్యం కుంభకోణం కేసు గురించి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒంగోలు వైసీపీ MP అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దర్శి MLA బూచేపల్లి పేరు ఈ కేసులో వినిపిస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉదంటూ సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. డబ్బులు బూచేపల్లికి చేరాయని ఆరోపిస్తుండగా.. నిజంగా ఆయన పాత్ర ఉందా? లేక కావాలనే చేర్చారా? అనేది తేలాల్సి ఉంది.

News September 19, 2025

NLG: బిల్లులు ఇప్పించండి మహాప్రభో..!

image

నల్గొండ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఏటేటా ఈ బకాయిలు పెరిగి ఇప్పటివరకు సుమారుగా రూ.6.81 కోట్ల పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు మూడేళ్లుగా బిల్లులు అందక ఆందోళన చెందుతున్నారు. 2022-23 నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆయా పాఠశాలల యాజమాన్యాలు తెలిపాయి.

News September 19, 2025

HYD: ‘అయ్యా..! మా కడుపుమీద కొట్టకండి

image

HYD, రంగారెడ్డి జిల్లాలోని పేదల రేషన్‌కార్డులు కట్ చేశారని మండిపడుతున్నారు. సమాచారం ఇవ్వకుండా తమ కడుపుమీద కొట్టారని వాపోతున్నారు. డీలర్ల వద్ద సమాచారం లేదని, అధికారులను అడగాలంటున్నారని వాపోయారు. వ్యవస్థ మీద అవగాహనలేనివారి పరిస్థితి ఏంటని ప్రశిస్తున్నారు. కొందరు మండలాఫీసులో సంప్రదిస్తే అధికారులకే కారణం తెలియడంలేదని వాపోతున్నారు. తమ కార్డలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. మీ కార్డూ రద్దైందా?