News January 30, 2025

ADB: కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

Similar News

News February 13, 2025

10 జీపీఏ సాధించిన వారిని విమానంలో తీసుకెళ్తా: కలెక్టర్ 

image

కేజీబీవీ విద్యార్థినులు 10వ తరగతిలో పదికి పది జీపీఏ మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె కనగల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో ముఖాముఖి నిర్వహించి.. వారితో సెల్ఫీ దిగారు. పదవ తరగతిలో 10-10 జీపీఏ సాధించిన వారిని విజయవాడ, చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

News February 13, 2025

కేంద్రమంత్రిని కలిసిన ఎన్టీఆర్ జిల్లా రైతులు

image

విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్ ప్యాకేజీ- 3కి సంబంధించిన సమస్యలను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరితో కలిసి వారు ఢిల్లీలో గడ్కరీని కలిశారు. ప్యాకేజీ- 3లో సర్వీస్ రోడ్ కేటాయింపు తదితర అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అధికారులతో చర్చించి ఆయా అంశాలను పరిష్కరిస్తామన్నారు.

News February 13, 2025

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్‌కు జిల్లా వాసులు

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ఈ నెల 15 నుంచి 28 వరకు కాకినాడలో జరుగునుంది. ఈ టోర్నమెంట్‌కు జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు జాకోర ZPHSకు చెందిన PET స్వామి కుమార్, డిచ్పల్లి ZPHSకు చెందిన PET స్వప్న రాష్ట్ర జట్టుకు సారథులుగా ఎంపికైయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ , SGF కార్యదర్శి నాగమణి వారిని అభినందించారు.

error: Content is protected !!