News June 23, 2024
ADB: కొనసాగుతున్న POLYCET సర్టిఫికెట్ వెరిఫికేషన్
POLYCET సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నేడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుతుందని పాలిసెట్ సమన్వయకర్త భరద్వాజ తెలిపారు. అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకొని తగిన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని తెలిపారు.
Similar News
News November 17, 2024
బీర్సాయిపేట్: ‘రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి’
ఉట్నూరు మండలంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో బీర్సాయిపేట్, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీర్సాయిపేట్ అటవీశాఖ అధికారులు కోరారు. ఆదివారం వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో పెద్దపులి సంచార సమాచారం ఉందన్నారు. బీర్సాయిపేట్, పరిసర గ్రామాలతో పాటు నార్నూర్,జైనూరు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పులికి ఏ హాని తలపెట్టవద్దని, నష్టం జరిగితే అటవీశాఖ నష్టపరిహారం ఇస్తుందన్నారు.
News November 17, 2024
మందమర్రిలో కనిపించిన పెద్దపులి
మందమర్రిలోని శంకరపల్లి, KK 5 గని సమీపంలో శనివారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. కొద్దిరోజులుగా జన్నారం, కాసిపేట, చెన్నూర్, వేమనపల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. కాగా నిన్న మహారాష్ట్ర వలస కూలీలకు శంకరపల్లి వద్ద పులి కనిపించినట్లు తెలిపారు. శంకరంపల్లి సమీపంలో గుడారాల్లో ఉంటున్న తమ వైపు పెద్ద పులి వచ్చిందన్నారు. గుడారాల్లోని వారందరూ భారీగా కేకలు వేయడంతో అది శతలాపూర్ వైపు వెళ్లినట్లు పేర్కొన్నారు.
News November 17, 2024
ఉట్నూర్: ఆవుపై దాడి చేసిన పెద్దపులి
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో పెద్దపులి కలకల రేపుతోంది. తాజాగా శనివారం సాయంత్రం ఉట్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామ పంచాయతీలోని వంక తుమ్మ గ్రామ సమీపంలో ఓ ఆవుపై దాడి చేసింది. దీంతో ఆవు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.